: బెంగళూరు ఏటీఎం నిందితుని పోలిన వ్యక్తితో కలకలం
బెంగళూరు ఏటీఎంలో బ్యాంకు మేనేజర్ జ్యోతిపై కత్తితో పాశవికంగా దాడి చేసిన నిందితుడిని పోలిన వ్యక్తి ఈ రోజు అనంతపురం జిల్లా రాయదుర్గంలో కనిపించాడు. ఎస్ బీఐ ఏటీఎం వద్ద ఉన్న అతన్ని సెక్యూరిటీ గార్డు పట్టుకునేందుకు యత్నించగా... ఆ వ్యక్తి పారిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించడంతో పాటు... స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫూటేజ్ ను పరిశీలించిన పోలీసులు... ఏటీఎం సైకో వేరు... ఈ వ్యక్తి వేరని తేల్చేశారు.