: టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు, ఒక విషాదకర ఘటన: సీపీఐ నారాయణ
టీడీపీ, బీజేపీలు దగ్గరవుతున్నాయని... పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఓ విషాదకర ఘటన అన్నారు. ఈ రోజు మెదక్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని నారాయణ ఆరోపించారు. సభలో టీబిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడం సాక్షాత్తూ రాష్ట్రపతిని అవమానించడమేనని విమర్శించారు. రాష్ట్రానికి ఇండియా టుడే ఇచ్చిన అవార్డులను చూసి ముఖ్యమంత్రి మురిసిపోతున్నారని... అవేమీ రాష్ట్రపతి అవార్డులు కావని ఎద్దేవా చేశారు. సీఎం కిరణ్ ది దుష్టపాలన అంటూ విమర్శించారు.