: సీఎం కిరణ్ తో భేటీ అయిన ఏపీఎన్జీవో నేత విద్యాసాగర్
ఏపీఎన్జీవో నేత విద్యాసాగర్ ఈ రోజు విజయవాడలో ముఖ్యమంత్రి కిరణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని ఆయన సీఎంను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కొత్త ఏడాది కానుకగా ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ, జనవరి 3నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా ధర్నాలు చేపడతామని, బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు.