: రాజ్ ఠాక్రేతో అమితాబ్ కలయిక ఉత్తర భారతీయులకు అగౌరవం: సమాజ్ వాదీ పార్టీ


మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రేతో అమితాబ్ వేదికను పంచుకోవడాన్ని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అబు అజ్మి తప్పుబట్టారు. అమితాబ్ తన చర్యతో ఉత్తర భారతీయులందరినీ అవమానించారని విమర్శించారు. మరాఠీ పేరుతో దేశాన్ని ప్రాంతీయంగా, మతపరంగా చీలుస్తున్న రాజ్ తన మనస్సును మార్చుకున్నారా? అని ప్రశ్నించారు. ఒక అమితాబ్ తోనే రాజ్ కలుస్తారా? లేదా ఉత్తర భారతీయులందరితోనూ ఆయన స్నేహంగా ఉంటారా? అని అన్నారు.

ఎంఎన్ఎస్ సీనీ విభాగమైన 'మహారాష్ట్ర నవనిర్మాణ చిత్రపట్ కర్మచారి సేన' ఏడవ వార్షికోత్సవాల సందర్భంగా గత సోమవారం జరిగిన కార్యక్రమానికి అమితాబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జరిగిన ఘటన తమను ఎంతగానో భాధించిందని అబు అజ్మి ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఉత్తర భారతీయులపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. అమితాబ్ కూడా ఉత్తరప్రదేశ్ కు చెందినవారే. దీంతో సమాజ్ వాదీ పార్టీ అమితాబ్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టింది.

  • Loading...

More Telugu News