: లెజండరీ జాజ్ స్వరకర్త యూసెఫ్ లతీఫ్ మృతి
ప్రముఖ జాజ్ స్వరకర్త యూసెఫ్ అబ్దుల్ లతీఫ్(93) నిన్న (మంగళవారం) కన్ను మూశారు. కొన్ని నెలల నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన మాసాచుసెట్స్ లోని షట్స్ బరీలో ఉన్న తన నివాసంలో మృతి చెందారు. 1920 అక్టోబర్ 9న జన్మించిన లతీఫ్ జాజ్ స్వరకర్తగా పాప్యులర్ అయ్యారు. అమెరికన్ జాజ్ సంగీతాన్ని భారతీయ రాగాలతో మేళవించి... జాజ్ సంగీతంలో కొత్త ఒరవడికి లతీఫ్ నాంది పలికారు.