: రాష్ట్రంలో బస్సు మాఫియా నడుస్తోంది: పాలెం బస్సు ప్రమాద బాధితులు


పాలెం బస్సు దుర్ఘటన జరిగి 55 రోజులైనా ఇంతవరకు ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించలేదని పాలెం బస్సు ప్రమాద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలెం బస్సు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన తమకు ఇంతవరకూ న్యాయం జరగలేదని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. లక్ష రూపాయలిచ్చి చేతులు దులుపుకొన్న ముఖ్యమంత్రి కిరణ్, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణలను వారు దుయ్యబట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

బస్సు దగ్ధం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బస్సు మాఫియా నడుస్తోందని, బస్సు మాఫియాను అరికట్టేందుకు తమతో కలిసి రావాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీన కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించనున్నట్లు పాలెం బస్సు ప్రమాద బాధితులు తెలిపారు.

  • Loading...

More Telugu News