: బీజేపీతో పొత్తు ఖాయమే: పయ్యావుల
రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ చెప్పారు. విశాఖలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేది లేదని జగన్ ప్రజలకు అఫిడవిట్లు ఇవ్వాలని పయ్యావుల సవాల్ విసిరారు. జనవరి 3 నుంచి శాసనసభలో విభజన బిల్లుపై చర్చ జరగాలని కోరారు. చర్చ సందర్భంగా సీమాంధ్ర ప్రజల మనోభావాలను వినిపిస్తామన్నారు.