: వీఐపీ దర్శనానికి వచ్చేవారు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలి: టీటీడీ


కొత్త సంవత్సరం రోజున తిరుమలకు వీఐపీ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. కాగా, జనవరి 1 సందర్భంగా సర్వదర్శనం భక్తులకు డిసెంబర్ 31 సాయంత్రం 5 గంటల నుంచి క్యూలైన్ లోకి అనుమతిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అదేరోజు నడక దారి భక్తులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి అనుమతి ఇవ్వనున్నామని అయితే, వీరికి 25వేల కూపన్లు మాత్రమే జారీ చేస్తామని చెప్పింది. జనవరి ఒకటిన రూ.300ల దర్శనం టికెట్ల విక్రయాన్ని నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇదేరోజు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News