: 'ఒక ఓటు-ఒక నోటు' నినాదంతో బీజేపీ విరాళాల సేకరణ


సాధారణ ఎన్నికల కోసం ప్రజల్లోకి వెళ్లనున్న భారతీయ జనతా పార్టీ కొత్త నినాదాన్ని రూపొందించింది. 'ఒక ఓటు - ఒక నోటు' నినాదంతో ప్రజల్లోకి వెళ్లి తమ పార్టీకి ఓటు వేయాలని బీజేపీ కోరనుంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలను కూడా సేకరించనుంది. కనీసం రూ.10 నుంచి గరిష్ఠంగా వెయ్యి రూపాయల వరకు విరాళం ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు పది కోట్ల కుటుంబాల నుంచి విరాళాలను సేకరించాలని అనుకున్నట్లు నిన్నటి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతల సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా మోడీని ప్రధాని చేయాలని, దేశానికి మోడీ సారధ్యం ఎంత అవసరమో అన్న విషయాన్ని అన్ని కుటుంబాలకు కార్యకర్తలు వివరించనున్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News