: చల్లబడ్డ ఆమ్ ఆద్మీ నేత.. అసమ్మతికి తెర
ఆమ్ ఆద్మీ పార్టీకి కాస్త ఊరట లభించింది. మంత్రి పదవికి తనను ఎంపిక చేయలేదని ఆగ్రహంగా ఉన్న అసంతృప్త నేత వినోద్ కుమార్ బిన్నీ చల్లబడ్డారు. కేజ్రీవాల్ ఆరుగురి పేర్లతో నిన్న ఢిల్లీ మంత్రివర్గ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం బిన్నీ తాను బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నానని, అది పార్టీకి ఇబ్బందికరంగా ఉండవచ్చన్నారు. ఈ ప్రకటన తర్వాత పార్టీ నేతలు సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్.. బిన్నీ ఇంటికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆయనకు నచ్చజెప్పారు. దీంతో పార్టీలో గొడవలు ఏమీ లేవని, తనకు అసంతృప్తి లేదని బిన్నీ ప్రకటించారు.