: పెట్రోలు, డీజలుకన్నా శక్తిమంతమైన ఇంధనాలు!


వాహనాల్లో ఎక్కువగా ఉపయోగించే పెట్రోలు, డీజలుకన్నా కూడా మరింత సమర్ధవంతంగా పనిచేయగల ఇంధనాలు త్వరలోనే రానున్నాయి. ఈ దిశగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పెట్రోలు, డీజలు స్థానంలో మరింత సమర్ధవంతంగా పనిచేయగల రెండవ తరం జీవఇంధనాలను అభివృద్ధి చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ తరహా ఇంధనాలకు సంబంధించిన ప్రత్యేక ఎంజైము కుటుంబాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

యార్క్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం ఎంజైము కుటుంబాన్ని కనుగొన్నారు. ఈ ఎంజైము చెట్ల మాను, చెక్క ముక్కలు, కార్డుబోర్టు వ్యర్ధాలు, కీటకాల పెంకులు ఇలాంటి వాటిని తేలిగ్గా విచ్ఛిన్నం చేయగల శక్తిని కలిగివుంది.

ఈ వనరుల నుండి తయారుచేసే ఇంధనాలను రెండవ తరం జీవ ఇంధనాలుగా పేర్కొంటారు. ఈ ఎంజైముతో వాటిని బయో ఇంధనాలుగా మార్చడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో వాహనాల్లో పెట్రోలు, డీజలు స్థానంలో ఈ ఇంధనాలను విరివిగా ఉపయోగించడానికి మార్గం మరింత సుగమమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News