: ప్రజలు కోరుకున్న తెలంగాణను సాధించి తీరుతాం: కేసీఆర్
రవీంద్రభారతిలో తెలంగాణ గ్రూప్ -1 అధికారులు రూపొందించిన డైరీ -2014ను కేసీఆర్ ఆవిష్కరించారు. ఆంక్షలు లేని తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తామని.. డిమాండ్ల కోసం రాజీ పడేది లేదని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణలో ఇప్పటికీ 85 శాతం వెనుకబడిన ప్రజలున్నారని ఆయన చెప్పారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామన్నారు. సంపూర్ణ తెలంగాణ కోసం అవసరమైతే మరో యుద్ధానికి సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు.