: వచ్చే 2014 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుల్లేవ్: కిషన్ రెడ్డి


వచ్చే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. విభజన ప్రక్రియలో కేంద్రం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా ముందుకెళ్తోందన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పార్లమెంటు, అసెంబ్లీలో ప్రస్తావించనున్నామని, అవసరమైతే తెలంగాణ ముసాయిదా బిల్లులో సవరణలు కోరతామని ఆయన అన్నారు. కేంద్రం మొండిగా ముందుకెళ్తే.. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News