: త్వరలో ఆన్ లైన్ లోకి ఉద్యోగుల సర్వీస్ రికార్డు: పీవీ రమేష్
త్వరలో ఉద్యోగుల సర్వీస్ రికార్డును ఆన్ లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ ప్రకటించారు. హైదరాబాదు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆన్ లైన్ లో వివరాల నమోదుకు దరఖాస్తు గడువును జనవరి 10వ తేదీ వరకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఫించనుదారులు తమ కుటుంబ సభ్యుల వివరాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు మాత్రమే ఇవ్వాలని ఆయన చెప్పారు. మరో వారం రోజుల్లో ప్రభుత్వేతర సంస్థల సిబ్బందికి విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.