: కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానంటున్న అన్నాహజారే
ఢిల్లీలో గురువారం జరిగే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం లేదని అన్నాహజారే తెలిపారు. కేజ్రీవాల్ 26వ తేదీన రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతి కోరారు. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసేందుకు తేదీ, సమయం ఖరారు కావలసి ఉంది. అయితే, అమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇప్పటివరకు తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని, అందుకే హాజరు కావడం లేదని అన్నా తెలిపారు. అదీగాక.. తన ఆరోగ్యం కూడా సహకరించడం లేదని ఆయన చెప్పారు.