: కరీంనగర్ జిల్లాలో ఇద్దరు ఘరానా దొంగల అరెస్ట్
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణంలో ఇవాళ ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కరీంనగర్ తో పాటు పరిసర జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో బయటపడింది. నిందితుల వద్ద నుంచి 13 లక్షల విలువైన స్వర్ణాభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులు, మూడు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది ఎల్ సీడీ టీవీలు, మూడు ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వారు ప్రయాణిస్తున్న ఆటోను కూడా సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.