: అధిక ధరలకు అమ్ముతున్నారని పలు బేకరీలపై కేసులు


హైదరాబాదు నగరంలో ఇవాళ పలు బేకరీలపై తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు నిర్వహించారు. శీతల పానీయాలు, బేకరీ ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతున్నారంటూ ఫిర్యాదులు అందడంతో వారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గరిష్ట అమ్మకం ధర (ఎం.ఆర్.పి) లేబుల్ మీద స్టిక్కర్ అతికించి పలు బేకరీల్లో విక్రయాలు జరుగుతున్న విషయం బట్టబయలైంది. మరికొందరు దర్జాగా.. మెనూ బోర్డుల్లోనే ఎక్కువ ధరలు వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో, నగరంలోని పలు బేకరీలపై కేసులు నమోదు చేశారు. ఎక్కువ రేటుకు అమ్ముతున్న కూల్ డ్రింక్స్ ఉత్పత్తులను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News