: మంత్రి శ్రీధర్ బాబుకు హైకోర్టు నోటీసులు
మంత్రి శ్రీధర్ బాబుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రి అవినీతిని కరపత్రాల ద్వారా ప్రచారం చేసినందుకు తన భర్త శ్రీరామ్ ను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారంటూ ఓయూ విద్యార్థిని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు ఆదేశించాలని, తన భర్తకు మంత్రి నుంచి ప్రాణహాని ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ మంత్రి శ్రీధర్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ప్రాణహాని ఉందని చెబుతుండడంతో నిందితుడు శ్రీరామ్ ను కరీంనగర్ నుంచి హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది.