: యువ మోడీగా వివేక్ ఓబెరాయ్!
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ యువకుడిగా ఉన్నప్పటి జీవితంపై చిత్రం రూపొందించేందుకు అమెరికాకు చెందిన దర్శకుడు మితేష్ పటేల్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందులో యువ మోడీగా నటించమని బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ను దర్శకుడు సంప్రదించాడు. అయితే, దానిపై ఇంకా తానెలాంటి నిర్ణయాన్ని తెలపలేదని వివేక్ చెప్పాడు. ఒకవేళ వివేక్ ఒప్పుకుంటే త్వరలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలవుతుంది. రాజకీయాల్లోకి రాకముందు యువకుడిగా ఉన్న సమయంలో టీ దుకాణాన్ని నడిపిన మోడీ, గుజరాత్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ లో నిర్వహించే స్టాఫ్ క్యాంటిన్ లోనూ పనిచేశారు.