ఉభయసభలను ఉద్దేశించి చేసిన గవర్నర్ నరసింహన్ ప్రసంగం ముగిసింది. తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన గవర్నర్, తెలుగులోనే ప్రసంగాన్ని ముగించారు. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీ హాల్ నుంచి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. మరోపక్క టీఆర్ఎస్ సభ్యులు ప్రసంగం ప్రతులను చించి, గవర్నర్ పైకి విసురుతూ నిరసన వ్యక్తం చేశారు.