: గురువారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం


ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా గురువారం (26న) పదవీ స్వీకారం చేయనున్నారు. ఎన్నో పోరాటాలకు వేదికగా నిలిచిన జంతర్ మంతర్ లో పదవీ స్వీకారం చేయాలని మొదట అనుకున్నా... చివరకు వేదిక రామ్ లీలా మైదానానికి మారింది. ఇక, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత.. తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇవాళ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను కలిసిన కేజ్రీవాల్.. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ లేఖ ఇచ్చారు.

తాము గెలిచిన 28 నియోజకవర్గాల్లో సర్వే జరిపి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఏఏపీ నిర్ణయించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏఏపీకి ఇప్పటివరకూ 6 లక్షల 97 వేల సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్) అందాయి. దీంతో.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ఏఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ సీఎం షీలాదీక్షిత్ స్వాగతించారు. అయితే కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇస్తుందని షీలాదీక్షిత్ వెల్లడించారు. బేషరతుగా మద్దతు ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News