: నీలం సంజీవరెడ్డి గొప్ప రాజకీయ వైతాళికుడు: గవర్నర్ నరసింహన్
అనంతపురంలో ఇవాళ జరిగిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంత్యుత్సవాల్లో గవర్నర్ ప్రసంగించారు. ఈతరం రాజకీయ నాయకులకు నీలం సంజీవరెడ్డి స్ఫూర్తిగా నిలిచారని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. నీలం సంజీవరెడ్డి గొప్ప రాజకీయ వైతాళికుడు అని ఆయన ప్రస్తుతించారు. తెలుగు గడ్డపై పుట్టిన సంజీవరెడ్డి.. దేశానికే మంచి పేరు తీసుకొచ్చారని గవర్నర్ ప్రశంసించారు. జయంత్యుత్సవాల్లో పాలుపంచుకోవడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఈ సందర్భంగా అనంతపురం పట్టణంతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.