: రాష్ట్రపతి సమక్షంలో సమైక్యాంధ్ర నినాదం చేసిన శైలజానాథ్
అనంతపురంలో మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల సభలో శైలజానాథ్ సమైక్య రాష్ట్రమే కావాలంటూ నినదించారు. సంజీవరెడ్డి సేవలను కొనియాడిన శైలజానాథ్.. తెలుగువారైన సంజీవరెడ్డి శతజయంతి సభలో మాట్లాడటాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అయితే ప్రసంగం మధ్యలో ఆయన సమైక్యాంధ్ర గురించి మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే శక్తి రాష్ట్రపతికి ఉందని తెలిపారు. ప్రసంగాన్ని కూడా జై సమైక్యాంధ్ర, జైహింద్ అంటూ ముగించారు.