: బోర్డు సభ్యుడు బాలకృష్ణ రాజీనామాతో పడిపోయిన ఇన్ఫోసిస్ షేర్లు!
ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తాజాగా బోర్డు సభ్యుడు వి.బాలకృష్ణ వైదొలగడంతో స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లు పతనమవుతున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈ లో ఇన్ఫోసిస్ షేర్ వాల్యూ 2 శాతంపైగా పతనమై రూ.3,479 వద్ద ట్రేడవుతోంది. సంస్థ సహ వ్యవస్థాపకుడైన నారాయణ మూర్తి మళ్లీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎనిమిదవ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన బాలకృష్ణ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయడం గమనార్హం. ఆయన నిష్క్రమణ వల్లే సంస్థ నిర్వహణలో గందరగోళం ఏర్పడిందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.