: 50 మంది సమైక్య ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనంతపురం పర్యటన నేపథ్యంలో, అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 50 మంది సమైక్య ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.