: యాప్‌తో కేన్సర్‌ను కూడా గుర్తించవచ్చు


నిత్య జీవితంలో మనకు ఎన్నింటికో ఉపయోగపడే రకరకాల యాప్‌లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా స్కిన్‌ కేన్సర్‌ను గుర్తించేందుకు కూడా ఒక కొత్తరకం యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన విద్యార్ధులు ఈ కొత్త యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్ లోడ్ చేసుకుంటే చక్కగా చర్మ కేన్సర్‌ను గుర్తించడంలో ఉపకరిస్తుందని వీరు చెబుతున్నారు.

కదలలేని స్థితిలో ఉండే రోగులు, వృద్ధులకు చర్మ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందా? అనే విషయాన్ని తెలుసుకోవడం కాస్త కష్టమే. వారిని ఆసుపత్రికి తీసుకురావడం అనేది పెద్ద సమస్య. ఇలాంటి వారి విషయంలో ఆరోగ్య కార్యకర్తలకు ఈ యాప్‌ చక్కగా ఉపయోగపడుతుందట. ఈ యాప్‌ ద్వారా కేన్సర్‌ నిర్ధారణ పరీక్షల్లో వేగం, కచ్చితత్వం పెరుగుతాయని దీని రూపకర్తలు చెబుతున్నారు. ఈ యాప్‌ను అన్నిరకాల స్మార్ట్‌ ఫోన్లలో ఉపయోగించవచ్చట. ఈ యాప్‌తోబాటు వచ్చే క్లిప్‌ ఆన్‌ డివైజ్‌ను మొబైల్‌కు జతపరచి ఇలా కదలలేని వృద్ధుల, రోగుల చర్మాన్ని ఫోటో తీస్తారు. తర్వాత దాన్ని మొబైల్‌లోని అప్లికేషను విశ్లేషించి ఫలితాలను వెలువరిస్తుందని పరిశోధకుడు డెబ్దూత్‌ షీట్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News