: మత్తుకు త్వరగా బానిసలు కావడానికి కారణమేమంటే...


మత్తుమందుకు మనిషి దాసుడు కావడానికి కారణాన్ని పరిశోధకులు కనుగొన్నారు. క్షీరదాలు కొకైన్‌ వ్యసనానికి త్వరగా స్పందించి, దానికి బానిసై పోవడానికి కారణం వాటిలో ఉండే ఒక ప్రత్యేకమైన జన్యువేనని టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం గుర్తించారు. ముఖ్యంగా మనుషుల్లో కొకైన్‌ మూలంగా కలిగే స్పందనలు చాలా ప్రగాఢంగా ఉంటాయని వీరు చెబుతున్నారు.

ఈ పరిశోధకుల బృందానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఒకరు సారధ్యం వహించారు. క్షీరదాల్లోని సీవైఎఫ్‌ఐపీ-2 అనే జన్యువు కొకైన్‌ వల్ల త్వరగా ప్రభావితమై స్పందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతర మత్తుమందులకన్నా కొకైన్‌కు మనిషి త్వరగా బానిస కావడానికి ఈ జన్యువే ప్రేరణ కావచ్చని, అయితే దీనిపై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సిఉందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News