: అంతరిక్షంలో మరో కొత్త ప్రయోగం!


అంతరిక్షంలో అద్భుతాలు చేస్తున్న మానవడు త్వరలోనే ఇతర గ్రహాల్లో నివాసాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందుకోసం శాస్త్రజ్ఞులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు చంద్రుడిపై మొక్కల పెంపకానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అంతరిక్షంలో మానవ మూలకణం ఎలా పెరుగుతుంది? అనే విషయాన్ని గుర్తించడానికి శాస్త్రవేత్తలు మానవ మూలకణాన్ని అంతరిక్షంలో పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఫ్లోరిడాలోని మయో క్లినిక్‌, సెల్‌ థెరపీ ల్యాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు. భూమిపైకన్నా రోదసిలో మానవ మూలకణాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? అనే విషయాన్ని తెలుసుకోవడానికిగానూ ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన చేపట్టేందుకుగానూ తమకు మూడు లక్షల డాలర్ల నిధులు అందాయని శాస్త్రవేత్త అబ్బా జుబైర్‌ చెబుతున్నారు.

మనిషి ఎముక మజ్జలోని మూలకణాలు భూమిమీదకన్నా అంతరిక్షంలో వేగంగా పెరుగుతాయా? అనే విషయాన్ని ఈ పరిశోధన ద్వారా గుర్తించగలుగుతామని, అలాగే అంతరిక్షంలో మూలకణాలను వేగంగా అభివృద్ధి పరచడం, వాటితో కణజాలాలు, అవయవాలను త్వరగా పెంచడం కూడా సాధ్యమయితే, వాటితో కణజాలాలు, వెన్నెముక గాయాలు, ఇతర అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రోగులకు మరింత త్వరగా, సమర్ధవంతంగా మూలకణ చికిత్స చేసేందుకు వీలవుతుందని జుబైర్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News