: భారత్ -సౌతాఫ్రికా మ్యాచ్ డ్రా
మంచి జోరు మీద బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ను భారత్ బౌలర్లు ఆఖరికి నిలువరించగలిగారు. జోహేన్స్ బర్గ్ లో జరిగిన భారత్ -దక్షిణాఫ్రికా తొలిటెస్ట్ మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. 458 పరుగుల టార్గెట్ తో బ్యాటింగుకి దిగిన దక్షిణాఫ్రికా 450 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒక దశలో దక్షిణాఫ్రికా దూకుడు చూస్తే మ్యాచ్ ను సునాయాసంగా గెలుచుకుపోతుందనుకున్నారు. అయితే, భారత్ బౌలర్లు శ్రమటోడ్చడంతో దక్షిణాఫ్రికా ఆశలు నీరుగారిపోయాయి.