: హైదరాబాదు పబ్లిక్ స్కూల్ లో వింటేజ్ కార్ల ప్రదర్శన
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 90వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ వింటేజ్ కార్ల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. బేగంపేటలోని పబ్లిక్ స్కూల్ ఆవరణలో ప్రదర్శించిన వింటేజ్ కార్లు వీక్షకులను ఆకట్టుకున్నాయి. నిజాం కాలం నాటి పురాతన కార్లు, దేశ విదేశాలకు చెందిన 40 పురాతన కార్ల ప్రదర్శన చిన్నారుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపాయి. ప్రదర్శన అనంతరం పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ వింటేజ్ కార్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.