: రాష్ట్రపతితో సీమాంధ్ర టీడీపీ నేతల భేటీ
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో సీమాంధ్ర టీడీపీ నేతల బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయింది. ఈ బృందంలో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి రాజధాని, ఉమ్మడి రాజధానిపై గవర్నర్ ఆజమాయిషీలు రాజ్యాంగంలో ఎక్కడా లేవని వారు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. అంతేకాకుండా రాష్ట్రపతికి ఆరు పేజీల నివేదికను సమర్పించనున్నారు.