: సొంత గూటికి యడ్యూరప్ప... స్వాగతించిన బీజేపీ


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జనతా పార్టీ (కేజీపీ) అధ్యక్షుడు యడ్యూరప్ప భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోకి రానున్నారని, ఆయన్ను పార్టీలోకి చేర్చుకునే అంశంపై బీజేపీ అధిష్ఠానం కూడా అంగీకారం తెలిపిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప వెల్లడించారు. ఆయన బళ్లారిలో మీడియాతో మాట్లాడారు. యడ్యూరప్ప కూడా సొంత గూటికి వచ్చేందుకు సుముఖంగానే ఉన్నారని, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయన రాకను స్వాగతిస్తున్నారని ఆయన చెప్పారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడాన్ని యడ్యూరప్ప బలపరిచారని ఆయన చెప్పారు. తిరిగి బీజేపీలోకి రావడమే తన ఏకైక ఎజెండా అని ఇప్పటికే వెల్లడించారు. కాగా, కర్ణాటక రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా బీజేపీ నుంచి విడిపోయిన అనంతరం, యడ్యూరప్ప కేజీపీని స్థాపించి, సారధ్యం వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News