: పుజారాకు గాయం
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా నెట్స్ లో ప్రాక్టీసు చేస్తుండగా గాయపడ్డాడు. మొహాలీ స్టేడియంలో ప్రాక్టీసు చేస్తుండగా ఓ స్థానిక బౌలర్ విసిరిన బంతి పుజారా ఎడమ మోకాలిని బలంగా తాకింది. దీంతో, నొప్పితో విలవిల్లాడిన పుజారా వెంటనే మైదానం వీడాడు.
కాసేపటి తర్వాత మోకాలికి కట్టుతో కనిపించిన పుజారా మైదానంలోకి రాకుండా విశ్రాంతి తీసుకున్నాడు. కాగా, భారత్, ఆసీస్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో మూడో మ్యాచ్ ఎల్లుండి నుంచి మొహాలీలో జరగనుంది. పుజారా గాయం తీవ్రతపై జట్టు మేనేజ్ మెంట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.