: టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్యే పోటీ: ఎంపీ శివప్రసాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని... పుంజుకునే అవకాశం కూడా లేదని టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. ప్రజల మనోభావాలకు విలువనివ్వకుండా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలతో.. రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్యే ఉంటుందని చెప్పారు. ఈ రోజు చిత్తూరులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ నేత చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమని అనడం సరికాదని తెలిపారు.