: ఆస్తులు కాపాడుకునేందుకే తెలంగాణను అడ్డుకుంటున్నారు: దామోదర
డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సీమాంధ్ర నేతలపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ లోని తమ ఆస్తులను కాపాడుకోవడానికే సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అడ్డుపడినా తెలంగాణ ఏర్పాటు మాత్రం ఆగదని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అందరూ గుర్తించాలని కోరారు. ఈ రోజు మెదక్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.