: ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులకు రాహుల్ పరామర్శ
కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులను ఇవాళ పరామర్శించారు. బాధితుల పునరావాస కేంద్రాలకు వెళ్లి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారిని స్వగ్రామాలకు వెళ్లాల్సిందిగా ఆయన కోరారు. ఈ పర్యటనలో పలువురు బాధితులు రాహుల్ గాంధీతో మాట్లాడారు. తాము గ్రామాలకు తిరిగి వెళ్తే అల్లర్లు మళ్లీ జరుగుతాయేమోనన్న సందేహాన్ని వెలిబుచ్చారు. రాహుల్ వెంట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్. సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ తదితరులు ఉన్నారు.