: రాష్ట్ర సమస్యలను రాష్ట్రపతికి వివరించిన సీఎం కిరణ్
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. శీతాకాల విడిది కోసం హైదరాబాదు నగరానికి వచ్చిన రాష్ట్రపతిని ఆయన బొల్లారం రాష్ట్రపతి భవన్ లో కలిసి మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లుపై సమస్యలతో పాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది. హైదరాబాద్ గురించిన చర్చ జరిగిందని సమాచారం. విభజన బిల్లులో సమాచారంలో స్పష్టత లేదన్న విషయాన్ని కూడా సీఎం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. విభజన అంశంపై సీమాంద్ర ప్రతినిధుల వ్యతిరేకత అంశంపైనే మాట్లాడినట్లు తెలుస్తోంది. దాదాపు గంట పాటు ఈ సమావేశం సాగింది.