: ఉత్తర భారతంలో విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ


ఉత్తరాది రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ మహమ్మారి మళ్లీ కోరలు చాచుతోంది. చలి ఇంకా తొలగకపోవడంతో అనుకూల వాతారవణంలో ఈ ప్రాణాంతక వైరస్ తీవ్రంగా ప్రబలుతోంది. ఒక్క ఢిల్లీలోనే ఏడాది కాలంలో 1200 కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కాగా, ఇప్పటివరకు ఢిల్లీలో 16 మరణాలు సంభవించాయి. గత నాలుగు నెలల్లో గుజరాత్ లో ఈ వ్యాధి కారణంగా 90 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఈ ఏడాది అత్యధికంగా రాజస్థాన్ లో 124 మంది చనిపోయారని వైద్య, ఆరోగ్య శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News