: టెక్సాస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ గా భారత సంతతి మహిళ


అమెరికాలోని భారత సంతతి మహిళ నందితా బెర్రీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందిన ఆమె... టెక్సాస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ గా నియమితులయ్యారు. జనవరి 7న ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో ఆమె టెక్సాస్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా పని చేస్తారు. అంతే కాకుండా మెక్సికో సరిహద్దు వ్యవహారాల అధికారిగా కూడా వ్యవహరించనున్నారు. బెర్రీ 1968లో హైదరాబాద్ లో జన్మించారు. బెంగళూరులో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన నందిత, 21 ఏళ్ల వయసులో న్యాయ విద్యను అభ్యసించడం కోసం అమెరికా వెళ్లి అక్కడ మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News