: ఏపీఎన్జీవో అధ్యక్షునిగా ఎవరు ఎన్నికైనా సమైక్యాంధ్ర సాధనే మా లక్ష్యం: అశోక్ బాబు
ఇవాళ ఏపీఎన్జీవో అసోసియేషన్ సంఘ ఎన్నికలకు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ఎన్జీవోలందరినీ సంఘటితపరిచి ముందుకు నడిపించడమే తమ కర్తవ్యమని అశోక్ బాబు చెప్పారు. తమ సంఘ ఎన్నికలు సంప్రదాయ బద్ధంగా కొనసాగుతున్నాయని, అధ్యక్షునిగా ఎవరు ఎన్నికైనా 2014లో సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన వెల్లడించారు. వ్యక్తిగత ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు. 13 జిల్లాల నుంచి ఎన్జీవోలు ఈ ఎన్నికల్లో పాల్గొంటారని, తమ ప్యానల్ ను బలపరిచిన వారికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.