: 390 మంది జీవిత ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష
రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది జీవిత ఖైదీలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు హోంశాఖ ఖైదీల విడుదలకు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. స్టాండింగ్ కమిటీ నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవోలో పేర్కొంది. గాంధీ జయంతి రోజునే ఖైదీలను విడుదల చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంలో ఆలస్యమైనట్లు తెలుస్తోంది.