: పెద్దల ఒప్పందం కాదు.. ప్రజల ఒప్పందం కావాలి: లగడపాటి
రాష్ట్ర విభజన విషయంలో మెజారిటీ ఎమ్మెల్యేల నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ముందుకు వెళ్లరని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. విభజనకు కావాల్సింది పెద్దల ఒప్పందం కాదని... ప్రజల ఒప్పందమని తెగేసి చెప్పారు. సమైక్య ఉద్యమంలో సీఎం కిరణ్ గెలుస్తారని అన్నారు. ఈ రోజు తిరుపతిలో లగడపాటి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ సమైక్యానికే కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రజల అభిప్రాయం వినని పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రుల మనోభావాలను పట్టించుకోకపోతే... సమైక్య ఉద్యమం గాంధేయ మార్గం నుంచి గాండీవం వైపు మరలుతుందని హెచ్చరించారు.