: పుజారా (153) ఔట్.. ఇండియా 315/3
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగోరోజున ఇండియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ఈ రోజు 135 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన పుజారా 153 (270 బంతులు) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మరో బ్యాట్స్ మెన్ కోహ్లీ 90 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పుజారా, కోహ్లీలు మూడో వికెట్ కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కోహ్లీకి రోహిత్ జతకలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 315 పరుగులు.