: సీఎం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతల యత్నం


హైదరాబాదులోని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి వెళుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ను యూసఫ్ గూడ చెక్ పోస్టు వద్ద టీఆర్ఎస్ నేతలు అడ్డుకునేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో టీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారు. దాంతో, ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే టీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News