: ఆసుపత్రి నుంచి బెంగళూరు ఏటీఎమ్ దాడి బాధితురాలు డిశ్చార్జ్


బెంగళూరు ఏటీఎమ్ దాడి బాధితురాలైన కార్పోరేషన్ బ్యాంక్ అధికారిణి జ్యోతి ఉదయ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత నెల మొదటివారంలో చోటు చేసుకున్న ఈ దాడిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి జ్యోతి ఏటిఎమ్ లో డబ్బులు డ్రా చేస్తుండగా వెనుక నుంచి వచ్చి బెదిరించాడు. ఆ వెంటనే తలపై మూడుసార్లు కొట్టడంతో మెదడుకి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కుడివైపు పక్షవాతం వచ్చింది. ఇదిలాఉంటే ఏటీఎమ్ దాడికి పాల్పడిన నిందితుడు మాత్రం ఇంతవరకు దొరకలేదు.

  • Loading...

More Telugu News