: పెప్సీ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం కిరణ్
పెప్సీ కంపెనీ రూ. 1200 కోట్లతో నిర్మించనున్న బేవరేజ్ ప్లాంటుకు సీఎం కిరణ్ ఈరోజు హైదరాబాదులో శంకుస్థాపన చేశారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో ఈ బేవరేజ్ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. శంకుస్థాపన చేసిన తరువాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో పెప్సీ కంపెనీ రూ. 33 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోందని, ఇందులో సింహ భాగం రాష్ట్రానికి కేటాయించాలని ఆయన కోరారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సరైన కేంద్రమన్న సీఎం కిరణ్.. పరిశ్రమలకు కావలసిన అన్ని సదుపాయాల కల్పనకు తాము శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. గతేడాది విద్యుత్ కొరత.. పరిశ్రమల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని, అయితే ఈసారి ఆ సమస్యను అధిగమించామని కిరణ్ చెప్పుకొచ్చారు.