: ఏపీఎన్జీవో హోంకి భారీ భద్రత
ఏపీఎన్జీవో హోంకి పోలీసులు భారీ భద్రత కల్పించారు. హైదరాబాద్ లోని అబిడ్స్ నుంచి ఏపీఎన్జీవో హోంకు వెళ్లే అన్ని దారుల్లో భారీగా పోలీసులు మోహరించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ఏపీఎన్జీవోలు విభజనపై చర్చిస్తుండడంతో తెలంగాణ వాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.