: రాజంపేట నుంచి ప్రారంభమైన తిరుమల మహాపాదయాత్ర


చిత్తూరు జిల్లా రాజంపేట మండలం నుంచి తిరుమల పుణ్యక్షేత్రానికి ఇవాళ ఉదయం మహా పాదయాత్ర ప్రారంభమైంది. రాజంపేట మండల పరిధిలోని హెచ్.చర్లోపల్లె కోదండ రామాలయం నుంచి ప్రారంభమైన 21వ తిరుమల మహాపాదయాత్ర వైభవంగా ముందుకు సాగుతోంది. యాత్రలో పాల్గొన్న వేంకటేశ్వరస్వామి, పద్మావతి, అన్నమయ్యల వేషధారులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. రాజంపేట మండలం నుంచి అధిక సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొన్నారు. హరేరామ భజన సంఘం అధ్యక్షుడు దేవరకొండ భానుమూర్తి శర్మ భక్తులను ముందుండి నడిపిస్తున్నారు. ఆయన గత 20 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా పాదయాత్రగా బయలుదేరి తిరుమల వెంకన్న దర్శనం చేసుకొంటున్న విషయం విదితమే. భక్త బృందంలో రాజంపేట మండల నేతలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News