: బాపిరాజు గారింటికి మన రాష్ట్రపతి!
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 29న ఎంపీ కనుమూరి బాపిరాజు స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరం వెళ్లనున్నారు. టీటీడీ నిధులతో అక్కడ కొత్తగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో 29 ఉదయం పదకొండు గంటలకు జిల్లాలో అడుగుపెట్టి, కార్యక్రమాలు ముగిశాక మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వెళ్లిపోతారని తెలుస్తోంది. దాంతో, కనుమూరి ఇటీవలే గృహప్రవేశం చేసిన కొత్త ఇంటిలో రాష్ట్రపతి ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. కాగా, గతంలోనే ఆ పాఠశాల భవనాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేత ప్రారంభోత్సవం చేయించాలని కనుమూరి అనుకున్నారు. కానీ, భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో కుదరలేదు.