: పుజారా, కోహ్లీ అర్థ సెంచరీలు..247 పరుగుల ఆధిక్యం
టీమిండియా సఫారీ గడ్డపై వీరోచిత ఇన్నింగ్స్ ఆడుతోంది. 36 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు నిలకడగా ఆడింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే శిఖర్ ధావన్(15) వికెట్ కోల్పోయిన టీమిండియా తరువాత జాగ్రత్తగా ఆడింది. దీంతో పుజారా, విజయ్ లు నిలదొక్కుకున్నట్టు కనిపించారు. అంతలోనే మురళీ విజయ్(39) కలిస్ బౌలింగ్ లో డివిలీర్స్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
దీంతో క్రీజులోకి అడుగు పెట్టిన తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అండతో పుజారా(86) వీరోచిత ఇన్నింగ్స్ ఆడుతూ అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ(50) కూడా అర్ధ సెంచరీ మార్కు దాటేశాడు. దీంతో టీమిండియా మొదటి టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 247 పరుగుల ఆధిక్యంతో సఫారీలపై పూర్తి పైచేయి సాధించింది. పుజారా, కోహ్లీలు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ దిశగా సాగిపోతున్నారు.